Y. S. Sharmila: విశాఖ ఉక్కు పరిశ్రమకు న్యాయం చేయాలని డిమాండ్...! 10 d ago
విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానితో మిట్టల్ స్టీల్ గురించి చర్చ చేయడం హాస్యాస్పదం అని సోషల్ మీడియా వేదిక X లో స్పందించారు. కేంద్రం విశాఖ ఉక్కును ఉద్ధరిస్తామని చెప్పడం అంతా అబద్ద అసత్యాలే అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీకి " కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ కన్నా ఆంధ్ర హక్కు మీద లేదంటు" ఆమె పేర్కొన్నారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చినట్లే.. వైజాగ్ స్టీల్ కు కేంద్రం నిధులు ఇవ్వాలని లేదంటే ఎన్డీయే భాగస్వామ్యం నుంచి టీడీపీ, జనసేన తప్పుకోవాలంటూ ఆమె డిమాండ్ చేసారు.